వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని…
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో 2జీ కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని మన్మోహన్ సింగ్ పరిపాలనలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఏ రాజాని మరోసారి తన మంత్రివర్గంలోకి మన్మోహన్ సింగ్ తీసుకున్నారు. దీనిపై 2011లో ఆయన ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
DMK: తమిళనాడు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార డీఎంకే, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. తాజాగా డీఎంకే వివాదాస్పద నేత ఏ.రాజా ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. భారత తొలి సీడీఎస్ దివంగత జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం ప్రధాని నీలగిరిని సందర్శించలేదని అన్నారు.
India Not A Nation: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి డీఎంకే సీనియర్ నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాజా.. తాజాగా ‘‘ఇండియా ఒక దేశం కాదు’’ అని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
Sanatana Dharma: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ప్రక్రియ ఆగడం లేదు. తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)కి చెందిన ఉదయనిధి స్టాలిన్ తర్వాత డిఎంకెకు చెందిన ఎ రాజా సనాతన ధర్మాన్ని అవమానించారు.