గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ పంపిన వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు.
వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని…
తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పక్కన పెట్టారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
IPL Tickets Issue: తమిళనాడులో ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే సీఎస్కే టీం ను బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు కోరతున్నాయి. పీఎంకే శాసనసభ్యుడు ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే సీఎస్కేని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
హుక్కా బార్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే… తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చేసిన ఓ ట్వీట్ పై తమిళనాడు శాసనసభలో చర్చ జరిగింది. శాసనసభలో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రసంగిస్తూ.. ఓ ట్వీట్ గురించి ప్రస్తావించారు. ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంతరి స్టాలిన్…
ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం.. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.. ఇక, అసెంబ్లీలో సీఎం ఎదుటే.. పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్లో చూసిఉంటారు.. కానీ, తమిళనాడు సీఎం స్టైలే వేరు.. శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఓ ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ వ్యవసాయం రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ… కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను కేంద్రం ప్రతిపాదించినప్పటి నుంచి… బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అటు ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ చట్టాలను వ్యతిరేకించాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది తమిళనాడు సర్కార్. శాసన సభలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని…