ఈమధ్య కాలంలో సినీ దర్శకులు సినిమాల్లో నటిస్తున్న సందర్భాలు ఎక్కువయ్యాయి. అలా కొంతమంది దర్శకులు అయితే పూర్తిగా నటనకే పరిమితమైపోతూ కూడా ఉన్నారు. అయితే, తాజాగా రిలీజ్ అయిన తేజ సజ్జ మిరాయ్ సినిమాలో ఇద్దరు దర్శకులు కనిపించారు. సెన్సిబుల్ సినిమాలు చేస్తాడనే పేరు ఉన్న దర్శకుడు కిషోర్ తిరుమలతో పాటు కంచరపాలెం సినిమా చేసిన డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా కనిపించాడు. వీరిద్దరూ ఒకరు పోలీస్ ఇన్స్పెక్టర్‌గా, మరొకరు అతని బాస్‌గా కనిపించారు.
Also Read: Arjun Tendulkar: ఎంగేజ్‌మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్జున్!
అయితే, వీరిలో కిషోర్ తిరుమల కామెడీ టైమింగ్ అయితే బాగా వర్కౌట్ అయింది. మనోడు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ ఆడియన్స్‌ని నవ్వించాడంటే, ఆయన యాక్టింగ్‌లో ఎంత ఈజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. భయస్తుడైన పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కిషోర్ తిరుమల మెరిశాడు. ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత, అందులో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత, భవిష్యత్తులో మరింతమంది దర్శకులు ఆయన కోసం పాత్రలు రాసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వెంకటేష్ మహా గతంలో కూడా కొన్ని సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించాడు కాబట్టి, ఆయన పాత్ర కూడా బాగానే వర్కౌట్ అయింది. మొత్తంగా కిషోర్ తిరుమల ఈ సినిమాకి ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అనే చెప్పాలి.