ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలంగా మారింది. థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్‌కు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి.. రేవతి కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ పరామర్శించట్లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు.
Also Read: Allu Arjun: 2 వేల కోట్లు కలెక్ట్ చేశారు.. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముంది: మంత్రి
సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను హాస్పిటల్‌కు వెళ్లానని, పబ్లిసిటీ చేయలేదు కాబట్టే విషయం ఎవరికీ తెలియలేదని జగపతి బాబు చెప్పారు. ‘అందరికీ నమస్కారం. ఓ క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నా. నేను సినిమా షూటింగ్ నుంచి రాగానే.. సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లా. బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలనిపించి అక్కడకు వెళ్లా. ఆ దేవుడు, అందరి ఆశీస్సులతో త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చి వచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి.. నా వంతు సపోర్టు ఇవ్వాలనుకున్నా. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి విమర్శలు వచ్చాయి. క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు పెడుతున్నా’ అని జగపతి బాబు ఓ వీడియో రిలీజ్ చేశారు.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024