Krishna vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నట సమ్రాట్’కు ఇది రీమేక్. నానా పటేకర్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా తెలుగు వర్షన్‌లో ప్రకాశ్ రాజ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. అలానే ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రంగస్థల, సినీ నటుడు విక్రమ్ గోఖలే మరాఠీలో చేసిన పాత్రను ఇక్కడ బ్రహ్మానందం నటించారు.
Kantara movie: ఇంగ్లీష్‌లో రిషబ్ శెట్టి ‘కాంతారా’
‘రంగమార్తాండ’ చిత్రంలో రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రజా, వంశీ చాగంటి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాస్ట్రో ఇళయరాజా దీనికి స్వరాలు అందించారు. స్వర్గీయ సీతారామశాస్త్రి గీత రచన చేశారు. అలానే లక్ష్మీ భూపాల సైతం ‘రంగమార్తాండ’ కోసం ఓ షాయరీ రాశారు. దాన్ని మెగాస్టార్ చిరంజీవి గానం చేయడం విశేషం. దీనికి చిరంజీవిని ఎంపిక చేసుకోవడానికి కారణం గురించి కృష్ణవంశీ చెబుతూ, ”తెలుగులో నేను అభిమానించే గొప్ప నటుడు ఎన్టీయార్ గారు. ఆయన వాచకం అద్భుతం. ఆ తర్వాత అంత గొప్ప వాచకం చిరంజీవి గారికే సొంతం. అందుకే ఈ సినిమా కథాసారాన్ని తెలియచేసే ఈ షాయరీ చిరంజీవి గారు పాడితేనే బాగుంటుందని భావించాను. ఆయన్ని అడగగానే మరో ఆలోచన లేకుండా అన్నయ్య అంగీకరించారు. దీని రికార్డింగ్ సైతం ఎప్పుడో పూర్తయిపోయింది. అన్నయ్య ఒక్కరోజులోనే రికార్డింగ్ పూర్తి చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. ఆయన వాయిస్ ఈ షాయరీకి ప్రాణం పోసిందనే చెప్పాలి. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుది దశలో ఉంది. సో… రెండు వారాల్లో చిరంజీవి గారి షాయరీని విడుదల చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు.