క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం 'రంగమార్తాండ' సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరాఠీ చిత్రం 'నట సమ్రాట్'కు ఇది రీమేక్. నానా పటేకర్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా తెలుగు వర్షన్‌లో ప్రకాశ్ రాజ్ ఆ పాత్రను పోషిస్తున్నారు.
Kadgam: ఖడ్గం.. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఒక భారతీయుడిగా గర్వించదగ్గ సినిమా.. ప్రతి భారతీయుడితో దేశభక్తిని నిద్రలేపి.. జెండా చూడగానే చేయి ఎట్టి సెల్యూట్ చేసేలా చేసిన సినిమా. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ఏళ్లు.. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సంపూర్ణంగా జరుపుకున్నామంటే అది టీవీలో ఖడ్గం సినిమ చూశాకే అని ప్రజలు చెప్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకొంది.
(జూలై 28న కృష్ణవంశీ పుట్టినరోజు)మెగాఫోన్ పట్టిన కొద్ది రోజులకే ‘క్రియేటివ్ డైరెక్టర్’ అన్న మాటను పేరు ముందు చేర్చుకోగలిగారు కృష్ణవంశీ. ‘థింక్ ఔటాఫ్ ద బాక్స్’ అన్న రీతిలో కృష్ణవంశీ సాగుతూ ఉంటారు. పాత కథనైనా కొత్తగా చెప్పాలని తపిస్తారు- అదే కృష్ణవంశీ ప్రత్యేకత. ఆయన కెరీర్ లో సక్సెస్ రేట్ అంతగా లేకున్నా, తన ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శించాలనే భావిస్తారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగమార్తండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. కృష్ణవంశీ…