Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీశ్ శంకర్ ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్లిపోయారు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత హరీశ్ శంకర్ తీసిన ఏ సినిమా అంతటి విజయాన్ని తెచ్చిపెట్టలేదు. ఈ మధ్య హరీష్ శంకర్ పేరు కూడా పెద్దగా వినిపించట్లేదు. అయితే పూజ హెగ్డే బర్త్ డే సందర్బంగా ట్విట్టర్ లో ఒక ఫోటో ని షేర్ చేసి త్వరలో మనం షూటింగ్ లో కలుద్దాం అని తెలిపాడు.
Read Also: Audimulapu Suresh: పవన్ మాటతీరు వల్లే దాడులు.. చర్యలు తప్పవు..
పవన్ కళ్యాణ్ తో జీవితంలో ఒక్క సారైనా సినిమా చేయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. తన డేట్స్ కోసం ఇప్పటికే చాలా మంది దర్శకులు వేచి చూస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. నిజం చెప్పాలంటే భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. భీమ్లా నాయక్ తర్వాత ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి మరో సినిమా కి సైన్ చేసాడు. ఇక ఇవి అన్నీ ముందు ఒప్పేసుకోవడంతో భవదీయయుడు భగత్ సింగ్ చిత్రం ఇంకా ఆలస్యం కానుంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు.
Read Also: Geetha singh : నమ్మిన వాళ్లు మోసగించడంతో.. ఆత్మహత్యాయత్నం చేసిన కమెడియన్
భవదీయుడు భగత్ సింగ్ సినిమా లో పూజ హెగ్డేని కథా నాయిక గా ప్రకటించాడు. సినిమా షూటింగ్ మాత్రం వాయిదా పడుతూ వస్తుంది. చూడాలి మరి ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో. అయితే హరీష్ శంకర్ మాత్రం పవన్ కళ్యాణ్ తో తప్ప వేరే స్టార్తో సినిమా చేయడేమో అన్నట్టు కంకణం కట్టుకుని కూర్చున్నాడు. ఇక ఈ సినిమాకి మోక్షం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.