రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చింది.. తెలంగాణలో భాష మారబోతోంది.. ఇక, నీచమైన రాజకీయాలకు స్వస్తి పలకాలి అని ఆయన కోరారు. బీజేపీ 8 స్థానాలకు పరిమితమయింది.. బీజేపీ ఎందుకు వెనక్కి పోయింది అనే దానిపై చర్చ అవసరం.. బీజేపీ ఫలితాలపై చర్చ జరగాలి అని ధర్మపురి అర్వింద్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటి అని ప్రచారం చెయ్యడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది.. బీఆర్ఎస్ ఇక నిలబడదు.. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారనుంది అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పుకొచ్చారు.
Read Also: Cyclone Michaung: ముంచుకొస్తున్న తుఫాన్.. జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం..
నేను చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకొను అని ధర్మపురి అర్వింద్ అన్నారు. మాకు అభ్యర్థి లేని చోట కోరుట్లలో పోటీ చేసి.. పార్టీకి బలం పెంచి సక్సెస్ అయ్యాను.. డబ్బు పంచడంలో రాజకీయాలను దారుణంగా తయారు చేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పెరగడం కూడా నా ఓటమికి కారణమే.. కేసీఆర్ బయటకు రావొద్దని కోరుకుంటున్నాను.. మేం సగం సంతోషంగా ఉన్నాం.. ఇక, తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసింది అని ధర్మపురి అర్వింద్ అన్నారు.