INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- రేపే ఇండియా కూటమి సమావేశం..
- 23 పార్టీలు వస్తాయన్న కాంగ్రెస్..
- టీఎంసీ, డీఎంకే ఓటముల తర్వాత తొలి భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA alliance: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి భేటీకి సిద్ధమైంది. రేపు ( జూన్ 08)న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనుంది. గత రెండు సమావేశాలు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాసాల్లో జరినప్పటికీ, రేపటి సమావేశానికి తటస్థ వేదికను ఎంచుకున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఓడిపోయిన తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.
టీఎంసీ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు ఈ సమావేశానికి హాజరుకాబోతునున్నారు. మరోవైపు, తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడంతో, కాంగ్రెస్-డీఎంకే మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. దీంతో ఈ సమావేశానికి తాము రావడం లేదని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. ఈ సమావేశానికి 23 పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్నప్పటికీ సీపీఎం మాత్రం ఈ సమావేశానికి హాజరుకానుంది. పినరయి విజయన్, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ రెండు రోజుల క్రితం ఖర్గేకు లేఖ రాశారు.
Also Read
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ఈ సమావేశాని ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కూడా సమావేశానికి వస్తున్నట్లు చెప్పింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇతర చిన్నాచితక పార్టీలు సమావేశానికి వస్తున్నట్లు చెప్పాయి. ఓటమి తర్వాత, కాంగ్రెస్ స్నేహాన్ని మమతా బెనర్జీ పార్టీ కోరుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీలికగా మారడంతో ఆమె కాంగ్రెస్ సాయాన్ని కోరుతోంది. ఇక ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటీ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొంటామని చెప్పింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!