CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, రాబోయే స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అలాగే, కుప్పం నియోజకవర్గ కన్వీనర్ శ్రీకాంత్ సేవలను ఇకపై రాష్ట్ర స్థాయి అవసరాలకు, పార్టీ బలోపేతానికి వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పదవుల్లో ఉన్నవారు కేవలం తమకు కేటాయించిన సంబంధిత శాఖల బాధ్యతలను మాత్రమే చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ లైన్‌కు లోబడి పనిచేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రేపు ముగియనుంది. టీడీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్.. రేపు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్లను అధికారికంగా దాఖలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుండటంతో, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఒకవైపు స్థానిక ఎన్నికల సమరశంఖం, మరోవైపు రాజ్యసభ స్థానాల భర్తీతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయంగా మరింత దూకుడు పెంచింది.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!