PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా స్పష్టం చేసింది. ఒక మీడియా సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. SCO సభ్యదేశాలన్నింటికీ నిబంధనల ప్రకారం ఆహ్వానాలు పంపుతామని వెల్లడించారు. ఈ సంస్థ ప్రోటోకాల్ ప్రక్రియ ప్రకారం, ఆతిథ్యం ఇచ్చే దేశం సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వ నాయకులను ఆహ్వానించడం ఒక బాధ్యత అని, కాబట్టి భారత్ కూడా ఈ జాబితాలో ఖచ్చితంగా ఉంటుందని ఆయన వివరించారు. ఇదే సమయంలో, మనీలాలో జరిగే ఆసియాన్ (ASEAN) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మధ్య ఏవైనా ద్వైపాక్షిక భేటీలు జరుగుతాయా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. భారత్ నుంచి అటువంటి సమావేశం కోసం ఎలాంటి అభ్యర్థన రాలేదని పాక్ ప్రతినిధి పేర్కొన్నారు.
యూరేషియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఆర్థిక పురోగతిని పెంపొందించే లక్ష్యంతో 2001 జూన్ 15న బీజింగ్‌లో ఈ షాంఘై సహకార సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అనే 10 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ సంస్థలో అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన ‘కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్’ (CHS) అధ్యక్ష బాధ్యతలు ప్రతి సంవత్సరం ఆంగ్ల అక్షర క్రమం (Alphabetical Order) ప్రకారం సభ్యదేశాల మధ్య మారుతుంటాయి. ఆ క్రమంలోనే 2027లో ఇస్లామాబాద్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించే అవకాశం పాకిస్థాన్‌కు దక్కింది.
Also Read
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
తాజావార్తలు
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!