LV Gangadhara Sastry: ప్రముఖ భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, వక్త, సాంస్కృతిక సేవాకారుడు, తెలుగు భక్తి సంగీతానికి సేవ చేసిన వారిలో ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా ఎల్వీ గంగాధర శాస్త్రి పేరు పొందారు. శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ప్రజలకు ఆధ్యాత్మికతను చేరువ చేస్తూ అయన అనేక సేవలను అందించారు. అంతేకాకుండా ఆలయాల్లో సప్తగిరి కీర్తనాలు, ఆదిత్య హృదయం, లలితా సహస్రనామం వంటి అనేక ఆధ్యాత్మిక రచనలను పాడుతూ ప్రజల్లో భక్తి భావన పెంపొందించడంలో భాగస్వామ్యం అయ్యారు. తెలుగు ప్రజలలో ఆధ్యాత్మిక సందేశాన్ని సులభంగా అందించేందుకు ఆయన పాటలు, ప్రవచనాలు ఎంతో ప్రసిద్ధి. ఇకపోతే, ఆయన తాజాగా ఎన్టీవీ నిర్వహిస్తున్న పోడ్ కాస్ట్ విత్ ఎన్టీవీ కార్యక్రమానికి హాజరయ్యారు.
Read Also:Changur Baba: నేను నిర్దోషిని.. మత మార్పిడి ఆరోపణలపై ఛంగూర్ బాబా కీలక వ్యాఖ్యలు..
ఎన్నో విషయాల సంభాషణ మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో అనేక విషయాలను ఆయన చర్చించారు. ఇందులో ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించి ముఖ్యంగా సంగీత ప్రపంచానికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ గాయకులు స్వర్గీయ బాల సుబ్రమణ్యం, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పై స్పందించారు. అంతేకాకుండా, పరిశ్రమలో రాణించేందుకు మహిళల అవకాశాల గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also:Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ అమ్మకు వద్దు.. నాన్నకు ఇవ్వండి..! చిన్నారుల విజ్ఞప్తి
ఇవి ఇలా ఉండగా.. పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓ సభలో ‘సనాతనధర్మం’ అనే విషయం గురించి మాట్లాడారని.. అది విన్న చాలామంది ఆ విషయంపై పెద్ద సంఖ్యలో గూగుల్ చేశారని చెప్పుకొచ్చారు. వీటితో పాటు ఆయన అనేక ఆసక్తికర విషయాలను ఈ కార్యక్రమంలో ఆయన పంచుకున్నారు. ఇక ఈ ‘పోడ్ కాస్ట్ విత్ ఎన్టీవీ’ పూర్తి ఎపిసోడ్ శనివారం (జులై 19)న స్ట్రీమింగ్ కానుంది.