Devara Promotions in Mumbai: గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10న ట్రైలర్ విడుదల అవుతుందని ప్రకటించి.. ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తారక్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ముంబైలో దేవర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ.. సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ భామ అలియా భట్ రంగంలోకి దిగారు. హిందీలో దేవరను ప్రమోట్ చేసేందుకు అలియాతో పాటు బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా ముందుకొచ్చారు. ‘దేవర కా జిగ్రా’ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురు సందడి చేయనున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అలియా భట్ ‘జిగ్రా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆలియా నటన అందరిని ఆకట్టుకుంది. అక్టోబర్ 11న జిగ్రా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న దేవర విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో దేవర కోసం ఎన్‌టీఆర్, జిగ్రా కోసం ఆలియా కలిసి ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. కరణ్ జోహార్ వీరిద్దరి ఇంటర్వ్యూను చేయనున్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌ను అలియా ఇంటర్వ్యూ చేయనున్నారట. ఈ ఇంటర్వ్యూ ఇంకా రిలీజ్ కాలేదు. ఎన్టీఆర్, అలియా కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
#Devara ka #Jigra pic.twitter.com/zxtNLluw9u
— Devara (@DevaraMovie) September 10, 2024