Big Billion Days Sale 2024 Date: ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్ బిలియన్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! పండగే ఇగ
- సెప్టెంబర్ 30 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్
- ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే
- స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Big Billion Days Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ప్రతి ఏడాది ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. దసరా మరియు దీపావళి పండగ సీజన్ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి సేల్ మొదలు కానుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 29) సేల్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్య డీల్స్ వివరాలు వెల్లడి కానున్నాయి.
వారం పాటు కొనసాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో హోమ్ నీడ్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అతి తక్కువ ధరలతో అందుబాటులో ఉండనున్నాయి. ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండవచ్చు. స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్స్.. గృహోపకరణాలపై 75-80 శాతం వరకు ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులపై డిస్కౌంట్ అందిచనున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
Also Read: Muttiah Muralitharan: నా వరల్డ్ రికార్డును బ్రేక్ చేసే మొనగాడే లేడు: మురళీధరన్
సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. యాపిల్, శాంసంగ్, మోటో, వన్‌ప్లస్, షావోమీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభించేదీ త్వరలోనే వెల్లడించనున్నారు. యాపిల్ 16 సిరీస్ లాంచ్ అయిన నేపథ్యంలో పాత మోడళ్లపై భారీ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!