Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దేవర.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ “జాన్వీ కపూర్” హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి చిత్ర యూనిట్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది . దేవర ఫస్ట్ సింగిల్ అయిన “ఫియర్ సాంగ్”ను మే 19 సాయంత్రం 7.02 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సముద్రతీరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
#FearSong from tomorrow 7:02PM
An @anirudhofficial musical 🎶 #Devara #DevaraFirstSingle
Man of Masses @tarak9999 #KoratalaSiva pic.twitter.com/dEGHKz5S5B— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 18, 2024