తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది.. చేసిన అప్పులు సరిగా చెప్పలేదు.. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తప్పు పట్టిందని అన్నారు.