Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Deputy Cm Bhatti Vikramarka Participated In Christmas Celebrations In Lb Stadium

Bhatti Vikramarka: ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోంది..

Published Date :November 27, 2024 , 10:37 pm
By Mahesh Jakki
  • విద్య, వైద్యానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది
  • ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తోంది
  • ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhatti Vikramarka: తోటి మనుషులను ప్రేమించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావాలి.. సంఘంతో జీవించాలి అన్న క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని అధిగమిస్తూ ప్రజల అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులం సమిష్టిగా తయారు చేసి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముందుకు వెళ్తున్నామన్నారు.

Read Also: Telangana Caste Survey: రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తి

విద్య, వైద్యానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మాణం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పేదలకు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. ఇండ్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలని దీపావళి నుంచి మొదలుపెట్టామన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలను మహాలక్ష్మిగా గౌరవిస్తూ ప్రజా ప్రభుత్వం వారికి ఉచితంగా ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న రవాణా డబ్బులను వారి తరఫున ఆర్టీసీకి ప్రతినెల ప్రజా ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు చెల్లిస్తుందన్నారు.

Read Also: Minister Uttam Kumar Reddy: సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని తీసుకువచ్చి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును పేదలకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయదారులకు అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు నెలకు రూ.1000 కోట్లు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందన్నారు. నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ,జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఇప్పటి వరకు 55 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 500 రూపాయలకే మహిళలకు గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెంచడానికి, రైతులను ప్రోత్సహించడానికి, కేవలం 15 రోజుల్లోనే రెండు లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ 18 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసి రుణమాఫీ చేశామన్నారు.

కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్న క్రీస్తు మార్గం అనుసరిస్తూ ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఏడాదికి 20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయడానికి సమాజ హితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Christmas Celebrations
  • Deputy CM Bhatti Vikramarka
  • hyderabad
  • telangana
  • telugu news

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions