Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందనే భయం కేసీఆర్లో కనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఎన్డీవీ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలను గెలిచి కూడా మా పార్టీలోని 12 ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు అనే విషయాన్ని గుర్తు చేశారు. మేము ఎప్పుడూ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, నలిపేస్తాం, మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని తప్పుడు మాటలు మాట్లాడలేదని చెప్పారు. మేము ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టడమే మా యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. మేము ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కానీ, ఏ శాసన సభ్యుడిని గానీ, బలవంతంగా వచ్చి.. బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకోవడం లేదు.. వాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Read Also: Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య
Also Read
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
కేసీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. పలు సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే వస్తాయని తేలింది.. కేసీఆర్ కు వచ్చే సీట్లు వస్తాయని చెబుతున్నారు.. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ చెప్పే మాయమాటలు ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే సగానికి పైగా హామీలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి హామీని వంద శాతం మేం అమలు చేసి తీరుతాం.. బీఆర్ఎస్ ప్రభుత్వంలా మేము మోసాలు చేయం అని ఆయన పేర్కొన్నారు. ఇక, గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఎన్నీ హామీలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధును కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఇచ్చారని పేర్కొన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులను బీఆర్ఎస్ పార్టీ దారుణంగా మోసం చేసిందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Off The Record: రాయలసీమ బలిజల మొగ్గు ఎటువైపు..?
కరెంట్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తుంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు లేకుండా నిరంతర విద్యుత్ ను ప్రజలకు అందిస్తున్నాము.. కరెంట్ కోతలు అనేవి అవాస్తవం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్వాలిటీ విద్యుత్ ను అందిస్తున్నాం.. విద్యుత్, ఆర్థికశాఖలను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్థం చేసింది.. ఈ రెండు శాఖలు మాకు ఒక సవాల్ అని తెలిపారు. ఇక, హైదరాబాద్ కి వాటర్ సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంచి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
తాజావార్తలు
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..