Delta Farmers: ఖరీఫ్ వేళ.. డెల్టా రైతులకు కొత్త కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెల్టాకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్ సాగు ప్రారంభం అవుతున్న వేళ రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. డెల్టా ప్రాంతంలోని లక్షలాది ఎకరాల పరిధిలో పంటలు వేయాల్సి ఉండగా పంటలకు సాగునీరు అందించే పంట కాలువలు మాత్రం పూడికతో నిండి పోయి ఉన్నాయి. ఇరిగేషన్ రెవెన్యూ శాఖల సమన్వయంతో పంటలకు నీరు అందించాల్సిన అధికారులు కనీసం పంట కాలువల దుస్థితిపై దృష్టి పెట్టకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అధికారుల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు.
కృష్ణా ఆయకట్టు పరిధిలోని లక్షలాది ఎకరాల పంట సాగు మరికొద్దిరోజుల్లో ప్రారంభం అవుతున్న వేళ రైతుల కష్టాలు అధికారులకు పట్టడం లేదా అన్న ఆలోచన కలిగిస్తుంది. ఓవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని కానీ అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇరిగేషన్, వ్యవసాయ శాఖ రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో పెడచెవిన పెట్టాయని రైతులు అంటున్నారు. రైతుల బాధలు ఇరిగేషన్ శాఖ గాలికి వదిలేసినట్లూ కనిపిస్తుంది. జూన్ 10 నుండి రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ పరిధిలోని వందలాది పంట కాలువలు పూడికతో నిండి పోయి ఉన్నాయి.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- OTR : బావమరిది టీడీపీలోకి.. బావ కూడా వస్తారా?
ప్రకాశం బ్యారేజ్ దిగువన మంగళగిరి, దుగ్గిరాల ,తెనాలి, వంటి ప్రాంతాల్లో ప్రధాన డెల్టా ప్రాంతంలో బకింగ్ హామ్ కెనాల్ పూర్తి స్థాయిలో నీటి పారుదలకు సిద్ధంగా లేదని డెల్టా పరిధిలో అనేక గ్రామాల్లో సైతం పంట కాలువలు పూడికతో నిండి పోయి ఉన్నాయనీ రైతులు చెబుతున్నారు. జూన్ 10 నుండి సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా గత మూడు సంవత్సరాలుగా కృష్ణా డెల్టా ప్రాంతంలో పంట కాలువలో పూడిక తీయడం లేదని రైతులు చెబుతున్నారు. 2019లో పూడిక తీసిన వ్యవసాయశాఖ ఇరిగేషన్ అధికారులు ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు కరోనా అంశంతో చేతులెత్తేశారు.
దీంతో బకింగ్ హామ్ కెనాల్ తో పాటు అనేక పంట కాల్వలలో భారీగా పూడిక పేరుకుపోయింది.ప్రధానంగా తూటికాడతో పాటు మున్సిపాలిటీ నుండి విడుదల అవుతున్న వ్యర్థాలు సైతం పంటకాలంలో కలపడంతో దుర్గంధం వెదజల్లుతూ పంట కాలువలు పూడికతో నిండి పోయి ఉన్నాయనీ రైతులు అంటున్నారు. కనీసం ఈ ఖరీఫ్ సీజన్లో అయినా పూడిక తీసి సాగునీరు విడుదల చేసేందుకు సిద్ధం కావాల్సిన ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కనీసం పూడిక తీత పై ప్రభుత్వనికి ప్రతిపాదనలు కూడా పంపలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమయం సందర్భం లేకుండా, రైతులకు ఉపయోగపడకుండా సాగునీరు విడుదల చేసి ఏంటి ప్రయోజనం అంటూ నిలదీస్తున్నారు.
గతంలో నీటి సంఘాలు ఉన్నప్పుడు రైతుల ద్వారా నీటి సంఘాల అధ్యక్షులు ఎన్నికైనప్పుడు పంట కాలువలపై వారికి అవగాహన ఉండేది. నీటి సంఘాలు ఇరిగేషన్ శాఖ సమన్వయంతో పంట పొలాల మీద ,కాలువల మీద తిరిగే వారిని ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం పోయిందని రైతులు అంటున్నారు. నీటి తీరువా ద్వారా రైతన్నల నుంచి రెవిన్యూ శాఖ వసూలు చేస్తున్న సొమ్మును ఇరిగేషన్ శాఖకు ఇస్తే పంట కాలువల మెయింటినెన్స్ జరిగేదని, కానీ ఇరిగేషన్ కు రెవిన్యూ శాఖకు అగ్రికల్చరల్ శాఖకు సమన్వయమే లేకుండా పోయిందని రైతులు అంటున్నారు.
రైతులకు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సమన్వయం లేదని ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం పంట కాల్వల పరిస్థితిపై పర్యటించిన సందర్భం లేదని రైతులు అంటున్నారు. మున్సిపాలిటీ నుండి వ్యర్థపదార్థాలను పంటకాల్వలో కలపడం వల్ల పంట పొలాలకు నీళ్లు పెట్టాలంటే రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. పెద్ద ఎత్తున పంటకాలంలో చేరుతున్న ఫ్యాక్టరీల వ్యర్థాలు రైతులకు చర్మ రోగాలు తెప్పిస్తున్నాయి. నీటి కాలుష్యంతో పంట దిగుబడి తగ్గిపోతుంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో డెల్టా ప్రాంతంలో యుద్ధప్రతిపదికన పూడిక తీయాలని ఆ తర్వాతే నీటిని విడుదల చేయాలంటున్నారు. లేదంటే.. డెల్టా ప్రాంతంలోని అనేక పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. పూడిక తీయకుండా నీటిని విడుదల చేస్తే ప్రకాశం బ్యారేజ్ దిగువన మొదటి భూములకు ముంపు ప్రమాదం ఉంటుందని డెల్టా ప్రాంతంలో చివరి భూములకు నీరు అందని పరిస్థితులు వస్తాయని రైతులు అంటున్నారు.
Jubilee Hills Pub Gang Case: ఫిర్యాదు ఇచ్చారని తెలియగానే అందరం ఎస్కేప్
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?