Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1902 Mangapatnam Train Accident: అవి దేశాన్ని బ్రిటీషర్లు పరిపాలిస్తున్న రోజులు. తేదీ 1902 సెప్టెంబర్ 12. అప్పటి మద్రాసు నుంచి బాంబే (ముంబయి) వైపు ప్రయాణికులతో బయలుదేరిన ‘మెయిల్ రైలు’ ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కడప జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో కురిసిన భారీ వర్షాల వల్ల మంగపట్నం సమీపంలో ఉన్న రైల్వే వంతెన ఉద్ధృతంగా ప్రవహించిన వరద నీటిలో కొట్టుకుపోయింది. వంతెన కూలిపోయిన విషయం తెలియకపోవడంతో అదే దారిలో వేగంగా వచ్చిన ఆ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటి రైలు ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటనలో 10 మంది యూరోపియన్లు, 61 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. నేటితో ఆ రైలు ప్రమాదానికి 124 ఏళ్లు పూర్తయ్యాయి.
ప్రమాదంలో చనిపోయిన వారి అంత్యక్రియలను ఆ ఘటనా స్థలంలోనే నిర్వహించి, వారందరి జ్ఞాపకార్థం ఒక స్మారక స్తూపాన్ని నిర్మించారు. అయితే చాలామందికి దేశంలోనే తొలి రైలు ప్రమాదం జరిగింది కడప జిల్లాలోనే అనే విషయం తెలియదు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో బెంగళూరులోని కార్మెలైట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ థెరెసా (సీఎస్‌ఎస్‌టీ) సంస్థ అధిపతి, ఆంగ్లో-ఇండియన్ అయిన మదర్ థెరెసా సెయింట్ రోజ్ ఆఫ్ లీమా ఒకరు. దేశంలో వందకు పైగా పాఠశాలలు, అనాథ ఆశ్రమాలు, ఆరోగ్య కేంద్రాలు, సామాజిక కేంద్రాలను నడుపుతూ ఎనలేని సేవలు అందిస్తున్న ఈ సంస్థను ఆమె నడిపించారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా 2003లో మంగపట్నం వద్ద ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను, వైద్యశాలను కూడా స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు చాలా తక్కువ ఫీజుతో అనేక మంది విద్యార్థులకు ఈ స్కూల్ ద్వారా మంచి విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా, థెరెసా లీమా సేవలను గౌరవిస్తూ 2021లో కేంద్ర పోస్టల్ శాఖ ఆమె జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక పోస్టల్ కవర్‌ను కూడా విడుదల చేసింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ తొలి రైలు ప్రమాద స్మారక స్తూపం గండికోట జలాశయం వెనుక జలాల్లో ముంపునకు గురైంది. ప్రస్తుతం ఆ నీటి ఉద్ధృతి తగ్గడంతో స్తూపం జల దిగ్బంధం నుంచి బయటపడింది. గండికోట జలాల్లో మునిగి తేలిన ఈ ప్రమాద మృతుల స్తూపాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఘోర ప్రమాదం, నాటి మృతుల స్మారక చిహ్నం నేటికీ మన దేశ రైల్వే గతాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!