John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు మరో డిఫరెంట్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న ఓ కొత్త థ్రిల్లర్‌లో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. ‘Te3n’, ‘The Girl on the Train’ వంటి థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించిన రిభు దాస్‌గుప్తా ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుండగా, ఈ నెలలోనే లండన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో జాన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం మాత్రం మేకర్స్ ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంచారు. అయితే ఈ పాత్ర జాన్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఎవరూ ఊహించని షేడ్స్ తో చాలా ఇంటెన్సిటీగా అతని పాత్రని రూపొందిస్తున్నట్లు సమాచారం.
జాన్ కూడా ఈ పాత్ర విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పైకి కనిపించేంత సింపుల్‌గా ఈ క్యారెక్టర్ ఉండదని, పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయని సమాచారం. అందుకే షూటింగ్ కి ముందే క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడంపై జాన్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ద్వారా జాన్‌లో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని మరో కోణాన్ని దర్శకుడు రిభు దాస్‌గుప్తా బయటకు తీసుకురాబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది. రిభు దాస్‌గుప్తాకు థ్రిల్లర్ జానర్లో మంచి అనుభవం ఉంది. అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘Te3n’, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘The Girl on the Train’ వంటి సినిమాలను ఆయన రూపొందించారు. అందుకే జాన్ అబ్రహం లాంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న హీరోతో రిభు దాస్‌గుప్తా ఎలాంటి థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నారనే క్యూరియాసిటీ మొదలైంది.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఇదిలా ఉంటే జాన్ అబ్రహం మరోవైపు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘Maria IPS’ కోసం కూడా భారీగానే శ్రమిస్తున్నాడు. ఈ సినిమాలో నిజ జీవిత పోలీస్ అధికారి రాకేష్ మారియా పాత్రను జాన్ పోషిస్తున్నాడు. కథలో ఆ అధికారి జీవితంలోని వివిధ దశలను చూపించాల్సి ఉండటంతో జాన్ తన లుక్, బాడీ విషయంలో కూడా భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిభు దాస్‌గుప్తా డైరెక్షన్ లో వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ టైటిల్, కథ, జాన్ పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. లండన్ షెడ్యూల్ ఈ నెలలో మొదలైన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
- Tags
- cinema
- John Abraham
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!