Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Murder Case: కన్న పేగు బంధాన్ని మరచి.. ప్రియుడుతో కలిసి కన్న తల్లిని ఓ కూతురు హత్య చేసిన ఘటన కలకం రేపుతోంది.. గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ మహిళను ఆమె కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పొన్నూరు 8వ వార్డులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని లక్ష్మిగా గుర్తించారు.
డబ్బుల విషయంలో తల్లితో గొడవ
లక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె కుమారుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఆమె కూతురు పుష్పలత ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆమెకు రెండు వివాహాలు జరిగినప్పటికీ కుటుంబ కలహాల కారణంగా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పుష్పలత.. రాజా అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లక్ష్మి తన బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు సమాచారం. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని పుష్పలత తల్లిని కోరినట్లు తెలుస్తోంది. అయితే అందుకు లక్ష్మి అంగీకరించకపోవడంతో వివాదం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు
డబ్బులు ఇవ్వలేదనే కారణంతో పుష్పలత తన ప్రియుడు రాజాతో కలిసి తల్లి లక్ష్మిని హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు అర్బన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, డబ్బుల వ్యవహారం, నిందితుల పాత్ర తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!