Unethical: లైంగికదాడికి యత్నించిన పెంపుడు తండ్రిపై కూతురు దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది. కండ్ల కోయలోని మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తు ఓ వ్యక్తి వరసకు కూతురైన మైనర్ బాలికపై కన్నువేశాడు. కొన్ని రోజుల క్రితమే ఊరు నుంచి మైనర్ బాలిక తల్లి దగ్గరికి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ కూతురుపై ఆ పెంపుడు తండ్రి కన్నుపడింది. మహిళ ఇంట్లో లేని సమయంలో కూతురు పైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తనపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్న పెంపుడు తండ్రి పై దాడి పాల్పడింది.
Read also: Manhole: మ్యాన్‌హోల్‌లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కండ్లకోయలో నివాసముంటున్న ఒరిస్సాకు చెందిన జయశ్రీనాయక్ అనే మహిళ కు పద్మనాభనాయక్ అనే వ్యక్తి తో సహజీవనం చేస్తుంది. గత మూడు నెలల (మొదటి భర్త కూతురు) తల్లి ఉంటున్న ప్రాంతానికి వచ్చింది. ఈ క్రమంలో సవతి తండ్రి ఆ బాలిక పట్లు పిచ్చి చేష్టలు చేసేవాడు. అయితే ఆ బాలికకు నచ్చేవి కాదు. చిరాకు తప్పిస్తుండటంతో పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో ఈ నెల 8న మధ్యాహ్నం సమయంలో తల్లి డ్యూటీకి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న వరసకు కూతురైన బాలిక వద్దకు పద్మనాభనాయక్ పుల్ గా మద్యం సేవించి వచ్చాడు. ఆ బాలికపై లైంగికదాడికి యత్నించాడు. తను వదిలించుకుని వస్తున్నా బాలికపై దాడిని మాత్రం వదలలేదు. ఈ క్రమంలో తనుకు తాను రక్షించికునేందుకు అక్కడే వున్న కడి (కర్ర)తో తలపై దాడి చేసింది. తీవ్రంగా దాడి చేయడంతో పద్మనాభనాయక్ అక్కడికక్కడే కిందికి పడిపోయాడు. అయితే.. మధ్యాహ్నాం భోజనానికి ఇంటికి వచ్చిన తల్లి ఈఘటన చూసి నిర్ఘాంత పోయింది. కూతురిని ఏం జరిగిందని అడిగితే విషయం చెప్పింది. దీంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పద్మనాభనాయక్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ దర్యాప్తు చేస్తున్నారు.
Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణం.. వెలుగులోకి కేరళ స్టోరీని మించిన అంశాలు