Crime News: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా దేశరాజధానిలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Labourers Stranded: తజికిస్తాన్‌లో చిక్కుకున్న జార్ఖండ్ కార్మికులు.. దిక్కు తోచని స్థితిలో..
ఈశాన్య ఢిల్లీలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఏడేళ్ల చిన్నారి తన పొరుగింటికి ఆడుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు. బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా, స్నేహితుడి మామ ఆమెను బాత్రూంలోకి రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సోమవారం పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి తిరిగి వచ్చి జరిగిన ఘటన గురించి తన తల్లిదండ్రులకు వివరించింది. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించి ఆ యువకుడిపై ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదే రోజు నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు.