Rajnath Singh: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఏపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు.. కులరాజకీయాలను కాంగ్రెస్ పెంచి పోషించిందన్న ఆయన.. మేం ముస్లింకు వ్యతిరేకంగా ఉన్నామని ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.. అయితే, మేము అధికారంలోకి వచ్చాక ఒక దేశం ఒకే ఎన్నిక అమలు చేస్తాం అని ప్రకటించారు. విశాఖ టూరిజంగా.. పారిశ్రామికంగా అభివృద్ది చెందిన నగరాన్ని వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్ సిటీగా మార్చిందని ఆరోపించారు. సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా మారాల్సిన పేరు డగ్స్ రాజధానిగా మారుమోగుతుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వనికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తి అయ్యేదన్నారు.
Read Also: Soda : వేసవిలో సోడాలను ఎక్కువగా తాగుతున్నారా? మీరు డేంజర్లో పడ్డట్లే..Andhra Pradesh, Defense Minister Rajnath Singh, AP government, BJP-TDP-Janasena, YSRCP, CM YS Jagan, AP Elections 2024
ఇక, విశాఖలో ఎక్కడా లేని విధంగా భూకబ్జాలు జరిగాయని ఆరోపించారు రాజ్‌నాథ్.. భూ కబ్జాలు ఆగాలన్నా.. అవినీతి లేకుండా ఉండలన్నా.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్యం 13 లక్షలు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.. ఒక్కోక్కరి తలపై 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ దుర్మార్గమైన పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతో కూటమి ఏర్పడిందన్నారు.. అవినీతి లేని ప్రభుత్వం కూటమితోనే సాధ్యం అని ప్రకటించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.