ఎండ కాలం వచ్చిందంటే చాలు దాహం కూడా ఎక్కువగా వేస్తుంది.. దాహాన్ని తీర్చుకోవడం కోసం మనం జ్యూస్ లు సోడాలు, ఐస్ క్రీమ్ లను ఎక్కువగా తింటాము.. అయితే సోడాలు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు.. కానీ జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోరు. అసలే ఇటీవల సోడాలో రకరకాల ఫ్లేవర్స్ తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు.. అయితే సోడాలను ఎక్కువగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
సోడాలను ఎక్కువగా తాగితే పళ్ళు పుచ్చిపోవడం, దంతాలు రంగు మారడం, దంతాలు సున్నితంగా మారడం వంటివి జరుగుతాయి.. సోడాలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తాగడం వలన మనం అధిక బరువుకు గురవుతారు.. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం..
అంతేకాదు.. బిపి, డయాబెటిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీటిని తాగడం వలన మూత్రపిండాలపైన ఒత్తిడి పడి కిడ్నీ సమస్యలు వస్తాయి. సోడాలు ఎక్కువగా తాగడం వలన ఎముకలు బలహీనంగా మారుతాయి.. విపరీతంగా తలనొప్పి రావడంతో పాటుగా మైగ్రైన్ సమస్య కూడా రావచ్చు.. అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటివి వస్తాయి. పురుషులలో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. ఎప్పుడో ఒకటి అంటే చాలు కానీ రోజూ తీసుకుంటే మాత్రం మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే.. జాగ్రత్త సుమీ..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.