Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports David Warner Retirement Australia Opener David Warner Announces Retirement From Odi Cricket

David Warner Retirement: డేవిడ్‌ వార్నర్‌ సం‍చలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు సైతం గుడ్‌బై!

Published Date :January 1, 2024 , 8:17 am
By Sampath Kumar
David Warner Retirement: డేవిడ్‌ వార్నర్‌ సం‍చలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు సైతం గుడ్‌బై!
  • Follow Us :
  • google news
  • dailyhunt

David Warner announces retirement from ODI’s: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సం‍చలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్‌.. వన్డే క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్‌ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయన్నాడు. అయితే పాకిస్తాన్‌ వేదికగా జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను అందుబాటులో ఉంటానని దేవ్ భాయ్ తెలిపాడు.

సోమవారం సిడ్నీ గ్రౌండ్‌లో డేవిడ్‌ వార్నర్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘నేను వన్డే క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నాను. వన్డే ప్రపంచకప్ గెలవడం, అందులోనూ భారతదేశంలో గెలుపొందడాన్ని ఓ భారీ విజయంగా భావిస్తున్నాను. ఈ తరుణమే వన్డేలకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నా. నా నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయి. టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందని తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నా. రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరం అయితే అందుబాటులో ఉంటా’ అని తెలిపాడు.

Also Read: PSLV-C58 Launch: నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58!

ఈవారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ డేవిడ్‌ వార్నర్‌ కెరీర్‌లో చివరిది. 2009 జనవరి 18న హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వన్డే అరంగేట్రం చేసాడు. చివరి వన్డే మ్యాచ్ 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆడాడు. ఆసీస్ తరపున 161 వన్డేలు ఆడిన వార్నర్‌.. 6,932 పరుగులు చేశాడు. 2015 మరియు 2023లో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో 345 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో 647 పరుగులు చేసిన వార్నర్.. 2023 వన్డే ప్రపంచకప్‌లో 528 పరుగులు చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australia
  • David Warner
  • David Warner ODI Retirement
  • David Warner Retirement
  • David Warner Test Retirement

తాజావార్తలు

  • JD Vance: ఇస్లామాబాద్‌లో వింత మర్యాద.. చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం

  • KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..

  • Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!

  • Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

  • Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions