ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మరోసారి తన ఫామ్ ని ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో విజృంభించి, టీ20 ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. చిన్న జట్టు ఒమన్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ 51 బంతుల్లో 56 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియాకు అద్భుతంగా ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్.. 19వ ఓవర్ చివరి బంతికి హలీముల్లా వేసిన బంతిని ఎడ్జ్ తీసుకోవడంతో.. కాస్త కోపంగా పెవిలియన్‌కు వెళ్లాడు.
NEET UG 2024: నీట్ పరీక్షలో 67 మందికి వంద శాతం మార్కులు ఎలా వచ్చాయి?.. క్లారిటీ ఇచ్చిన ఎన్ టీఏ
అయితే, అతను పొరపాటుగా ఒమన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ మెట్లపైకి వెళ్లడం ప్రారంభించాడు. అతన్ని గమనించిన కొందరు, “హే వార్నర్, ఎక్కడికి వెళ్తున్నావు..?” అన్నారు. నువ్వు పోవాల్సింది అటు’’ అంటూ అనడంతో వార్నర్ ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఒమాన్ పై 39 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది.
Lok Sabha MPs: కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందచేసిన ఈసీఐ..