David Warner land via helicopter like Hollywood Hero: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాలీవుడ్ హీరో తరహా గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్ కోసం వార్నర్ ఏకంగా ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ల్యాండ్ అయ్యాడు. తన సొదరుడి వివాహానికి హాజరైన దేవ్ భాయ్.. అక్కడి నుంచి నేరుగా మ్యాచ్ వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డేవిడ్ వార్నర్ కోసం బిగ్‌బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. ఆస్ట్రేలియా తరఫున టెస్ట్, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో.. అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ తెలిపాడు. సిడ్నీ థండర్ కోసం గత మూడు సీజన్లుగా వార్నర్ ఆడుతున్నాడు. నేడు సిడ్నీ సిక్సర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో వార్నర్ ఆడనున్నాడు. బిగ్‌బాష్ లీగ్ అనంతరం యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ వ్యవహరిస్తాడు.
Also Read: Shaheen Shah Afridi: కెప్టెన్‌గా మొదటి మ్యాచ్.. మొదటి వికెట్ కూడా!
ఇటీవల డేవిడ్ వార్నర్ సిడ్నీ మైదానంలోనే పాకిస్తాన్ జట్టుతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సిడ్నీ టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జట్టు తరఫున కేవలం టీ20 ఫార్మాట్‌లో మాత్రమే ఆడనున్నాడు. ఫిబ్రవరి 9 నుండి 13 వరకు వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో వార్నర్ ఆడనున్నాడు. ఇక జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 వార్నర్‌కు చివరిదని తెలుస్తోంది.
Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥
– What an entry…..!!!!pic.twitter.com/TwTsQe9954
— Johns. (@CricCrazyJohns) January 12, 2024