Rajamouli David Warner: రాజమౌళి డైరెక్షన్లో యాక్టింగ్ ఇరగదీసిన డేవిడ్ భాయ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన వారిలో రాజమౌళి ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నగా పేరుపొందిన ఆయన తాజాగా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ తో కలిసి అడ్వర్టైజ్మెంట్ సంబంధించి నటించారు. మామూలుగా హీరోలు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని భావిస్తారు. కాకపోతే., డేవిడ్ వార్నర్ రాజమౌళితో కలిసి నటించాడు. ఈ మధ్య కాలంలో రాజమౌళి కొన్ని యాడ్స్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రాజమౌళి డేవిడ్ వార్నర్ తో కలిసి క్రెడ్ క్రెడిట్ కార్డుకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లో నటించారు.
Also read: West Bengal: బెంగళూర్ కేఫ్ పేలుడు కేసు.. బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ..
Also Read
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ఇక మరోవైపు డేవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో సిక్సులు, ఫోర్స్ తో ఎంత డ్యాషింగ్ గా బ్యాటింగ్ ఆడతాడో.. బయట సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉండడం మనం ఇదివరకే చాలాసార్లు చూశాం. ఇకపోతే డేవిడ్ వార్నర్ పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు నుంచి తగ్గేదేలే అంటూ ఆయన స్టైల్ లో రీల్స్ చేయడం మనం చూసాము. ఎన్నోసార్లు తెలుగు ప్రజలు వార్నర్ ను టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వమని కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఎట్టకేలకు ఈ యాడ్ ద్వారా ఆ కోరికను నెరవేర్చుకున్నారు డేవిడ్ వార్నర్. క్రెడ్ కార్డు వాడితే.. డిస్కౌంట్ వస్తుందని చెప్పడానికి వీరిద్దరూ ఒకటయ్యారు.
Also read: PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
ఇక ఈ యాడ్సంబంధించిన వీడియోలో మొదట రాజమౌళి మ్యాచ్ టికెట్స్ ను డిస్కౌంట్ లో ఇప్పించమని వార్నర్ కు కాల్ చేస్తాడు. అయితే అందుకు వార్నర్ క్రెడ్ UPI లో కట్టమని సలహా ఇస్తాడు. అయితే దానికి రాజమౌళి తన దగ్గర అది లేదని, నార్మల్ UPI లో కడితే డిస్కౌంట్ ఇస్తారా.. ? అనగా.. వార్నర్ అందుకు ఒక పని చేయాల్సి ఉంటుందని చెప్తాడు. అదేంటంటే.. తనతో మరో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలు తీయాలని అడగగా.. అందుకు జక్కన్న కొన్ని విజువల్స్ ను ఫ్లాష్ లో వేసుకుంటాడు. అదంతా అయ్యేపని కాదని.. వద్దు..దేవుడా.. నేను క్రెడ్ లోనే కట్టుకుంటానని చెప్పడంతో యాడ్ ముగిసింది. ఏదిఏమైనా.. రాజమౌళి దర్శకత్వంలో వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడో లేదో కానీ.. ఈ యాడ్ ద్వారా ఇలా కానిచ్చేశాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Warner bros 😉 @ssrajamouli pic.twitter.com/PfE0Sn9Tb0
— David Warner (@davidwarner31) April 12, 2024
- Tags
- CRED card
- David Warner
- rajamoli
- UPI
తాజావార్తలు
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!