అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జోరుగా కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం జనవరిలో రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. సహదత్ గంజ్ నుంచి నయా ఘాట్ వరకు 13 కిలోమీటర్ల రహదారి అయిన రామ్ పథ్ నిర్మాణంలో పురోగతి ఉందని పేర్కొంది.
Also Read : TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల.. https://ntvtelugu.com లో చెక్ చేసుకోండి
రామజానకీ మార్గం, భక్తి మార్గం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెల్లడించింది. సందర్శకుల తాకిడికి అనుగుణంగా విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను విస్తరిస్తున్నామని తెలిపారు. శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి ఆలయాలకు భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. రామ జన్మభూమి మార్గం వెడల్పు 30 మీటర్లు, భక్తి మార్గం వెడల్పు 14 మీటర్లుగా ఉండనుంది. అయితే రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ఆహ్వానం పలికారు. నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Russia: కీవ్ నగరంపై రష్యా దాడి.. అర్థరాత్రి డ్రోన్లతో బీభత్సం..
అయోధ్యలోని దుకాణాదారులు అద్భుతమైన మందిర నిర్మాణం, ఇతర సంబంధిత సౌకర్యాల కోసం తమ దుకాణ ప్రాంగణాన్ని ఇష్టపూర్వకంగా అందించారు. ప్రభుత్వ పరిహారం పంపిణీ ప్రక్రియ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సాగుతోంది అని యోగీ ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు ముంపునకు గురైన వారికి కొత్తగా అభివృద్ధి చేసిన సముదాయాల్లో దుకాణాలను కేటాయించామన్నారు. అంతేకాకుండా ఆస్తి యజమానుల సహకారంతో పలువురు దుకాణదారులను వారి స్వస్థలాలకు తరలించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు.