Danasari Seethakka: హమీల గురించి నీతులు చెప్పడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది
- మంత్రి సీతక్క గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
- సోషల్ మీడియాలో పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danasari Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క తాజాగా సోషల్ మీడియాలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇందులో భాగంగా.. తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని, అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరేనని ఆవిడా అన్నారు. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారని, వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్గా రూ.207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని, అంటే.. ప్రతి నెల సగటున 6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే సరిపోతుందని తెలిపారు.
Also Read: India-Canada Row: ఇండియాపై కెనడా ఆంక్షలు విధిస్తే.. భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..?
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలంటూ కాస్త గట్టిగానే రాసుకొచ్చారు. అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను మీరు చెల్లించలేదని, చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేందంటూ ధ్య బట్టారు. 5 వేల కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచులకు పెండింగ్ బకాయిలు, విద్యుత్ సంస్దలకు బకాయిలు, ఆర్టీసీకి బకాయిలు, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె బకాయిలు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల పెండింగ్.. ఇలా ప్రతి శాఖలో వందల కోట్ల బకాయిలు పెట్టి ఇప్పుడు బుకాయిస్తే ఏలా అంటూ మంత్రి రాసుకొచ్చారు.
Also Read: India-Canada Row: ఇండియాపై కెనడా ఆంక్షలు విధిస్తే.. భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..?
మీ నిర్వాకంతో గాడి తప్పిన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. ఈ పది నెలల కాలంలో 18 వేల కోట్ల పంట రుణాలను ప్రజా ప్రభుత్వం మాఫి చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల వంటింటి భారం దించేందుకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్, సామాన్యులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేసింది ఈ ప్రజా ప్రభుత్వమని, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు.. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. అయినా మీరు అప్పులు, బకాయిలు, హమీల గురించి నీతులు చెప్పడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేసారు.
తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు. అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరు.
మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్ గా రూ. 207 కోట్లు…
— Danasari Seethakka (@meeseethakka) October 16, 2024
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?