AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Knife Attacks in AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం, కడప జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఘర్షణలు, దాడులు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల కత్తులు, వేట కొడవళ్లు, కట్టెలతో దాడులు జరగడంతో పలువురు గాయపడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియపై ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
యల్లనూరులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ:
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఏజెంట్లుగా వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ కార్యకర్తలపై పోలింగ్ కేంద్రం సమీపంలో వైసీపీ మద్దతుదారులు దాడి చేశారు. వేట కొడవళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీకి చెందిన ఆరుగురు గాయపడగా.. వారిని చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమపై కూడా దాడి జరిగిందని వైసీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
Also Read
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
- 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
- Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
- Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
కొంగనపల్లిలో అర్ధరాత్రి కత్తులతో దాడి:
మరోవైపు గుంతకల్ మండలం కొంగనపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ వర్గీయులపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా.. మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. అలాగే మరికొందరు గాయపడటంతో వారిని తాడిపత్రి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
కడప జిల్లాలోనూ ఉద్రిక్తత:
కడప జిల్లాలో కూడా రెండో దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో వివాదాలు చోటుచేసుకున్నాయి. వీరపనాయనపల్లె మండలం పాయసంపల్లిలో పోలింగ్ ప్రారంభానికి ముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలోకి బయటి వ్యక్తులు రావడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వేంపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు తమను అనుమతించడం లేదని మహిళలు సహా పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ ఓట్లను కూటమి నేతలే వేస్తున్నారని కొందరు ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓటర్ల నుంచి బ్యాలెట్లు లాక్కుని బయటకు తీసుకెళ్తున్నారని కూడా ఆరోపణలు చేశారు.
ముళ్ల కంచెలను దాటుకుంటూ:
వేంపల్లిలో ఉదయం ఆరు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. అయితే చిన్న గేటు ద్వారా పోలీసులు ఓటర్లను లోపలికి పంపడంతో కొంత గందరగోళం నెలకొంది. ముళ్ల కంచెలను దాటుకుంటూ ఓటు వేసేందుకు వెళ్లినప్పటికీ తమకు ఓటు వేసే అవకాశం కల్పించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలతో అనంతపురం, కడప జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణలు, దాడులు, పోలింగ్ కేంద్రాల వద్ద ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!