Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Senior Heroines: ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను తమ గ్లామర్, నటనతో ఏలిన సీనియర్ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు తెలుగు తెరపై అరుదుగా కనిపిస్తున్నారు. కుర్ర హీరోయిన్ల జోరు పెరగడం, కథల ఎంపికలో మార్పులు రావడంతో వీరంతా టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది సమంత మాత్రం ‘మా ఇంటి బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించి తన ఉనికిని చాటుకుంది. కానీ, సమంత మినహా మిగిలిన సీనియర్ భామలందరూ ఈ ఏడాది టాలీవుడ్‌ను దాదాపు స్కిప్ చేశారనే చెప్పాలి. కొందరు బాలీవుడ్ బాట పడితే, మరికొందరు కోలీవుడ్‌పై దృష్టి పెట్టారు. ఇంకొందరు అసలు సినిమాల ఊసే ఎత్తకుండా అభిమానులను నిరాశపరుస్తున్నారు.
ఈ జాబితాలో అందరికంటే ముందుగా వినిపించే పేరు స్వీటీ అనుష్క శెట్టి. ‘ఘాటీ’ సినిమా తర్వాత అనుష్క మళ్లీ వెండితెరపై కనిపించకపోవడంతో ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనికి తోడు, రీసెంట్గా అనుష్క హైదరాబాద్‌లోని తన నివాసాన్ని కూడా అమ్మేసి, శాశ్వతంగా బెంగళూరుకు మకాం మార్చేసిందంటూ వార్తలు రావడం అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పోనీ, ఆమె నటించిన మలయాళ డబ్బింగ్ చిత్రం ‘కథనార్’ ద్వారా అయినా థియేటర్లలో అనుష్కను చూడొచ్చని ఆశపడితే, ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో, అసలు వస్తుందో రాదో కూడా మేకర్స్ స్పష్టత ఇవ్వడం లేదు.
Also Read
- AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
- 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
- Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
మరోవైపు, సహజ నటనతో ఆకట్టుకునే నిత్యామీనన్ తెలుగు ప్రేక్షకులకు దూరమై చాలా కాలమే అవుతోంది. ఎప్పుడో ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగులో మెరిసిన నిత్యా, ఆ తర్వాత స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయలేదు. మధ్యలో అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో పలకరించినా, ఈ ఏడాది అదీ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె తమిళంలో తాను నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌తో పాటు, ఏడాది చివర్లో రానున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ అనే హిందీ సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడం వల్లే, తాను యంత్రంలా పనిచేయలేనని, కృత్రిమంగా నటించలేనంటూ నిత్యామీనన్ కవర్ చేసుకుంటోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇక ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోయిన తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తెలుగు సినిమాలు చేయాలని వీరిద్దరికీ ఆసక్తి ఉన్నప్పటికీ, ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల తాకిడి, వారి గ్లామర్ షో ముందు వీరికి సరైన ఆఫర్లు దక్కడం లేదు. దీంతో ఇద్దరూ బాలీవుడ్ ప్రాజెక్టులతోనే బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ‘రామాయణ’ చిత్రంలో శూర్పణఖ పాత్రలో రకుల్ తళుక్కున మెరవగా, తమన్నా ‘వివాన్’ సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తమన్నా లైనప్‌లో అత్యధిక శాతం బాలీవుడ్ చిత్రాలే ఉన్నాయి.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సైతం ‘సత్యభామ’ తర్వాత ఫుల్ లెంత్ రోల్లో కనిపించలేదు. గతేడాది ‘కన్నప్ప’లో చిన్న గెస్ట్ అప్పీరియన్స్‌తో సరిపెట్టుకున్న కాజల్, ఈ ఏడాది కూడా హిందీలో ‘ద ఇండియా స్టోరీ’, ‘రామాయణ’లో మండోదరిగా కేవలం కొద్ది నిమిషాల పాత్రలకే పరిమితమైంది. అయితే, ఈ ఏడాది చివర్లో మాత్రం కాజల్ తెలుగు ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతోంది. నందమూరి బాలకృష్ణ ‘దాదా’ చిత్రంలో ఆమె పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది. డిసెంబర్ 24న ఈ సినిమా కచ్చితంగా విడుదలైతే, 2026ను చందమామ ఘనంగా ముగించినట్లే అవుతుంది. కాజల్ ఇలా ఏడాది చివర్లోనైనా టాలీవుడ్‌ను టచ్ చేస్తోంది కానీ, అనుష్క, రకుల్, నిత్యామీనన్ మళ్లీ తెలుగు తెరపై ఎప్పుడు సందడి చేస్తారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
-
AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!