IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj Snubbed Again in IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ గాయంతో మిగిలిన రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. మూడో రోజైన ఆదివారం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి హెల్మెట్‌కు రెండుసార్లు బంతి తగలడంతో కంకషన్‌కు గురయ్యాడు. దీంతో అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా టీమిండియా మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
వరుసగా రెండుసార్లు:
ఆకాష్ దీప్ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటింగ్‌లోనూ 29 పరుగులు చేశాడు. అయితే మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలుత జాకబ్ డఫీ వేసిన బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తగిలింది. ఆ తర్వాత కైల్ జేమీసన్ బౌలింగ్‌లో మరోసారి హెల్మెట్‌కు బంతి తగిలింది. వరుసగా రెండుసార్లు తలకు బంతి తగలడంతో.. వైద్య పరీక్షలు నిర్వహించిన బీసీసీఐ వైద్య బృందం అతడు కంకషన్‌కు గురైనట్లు నిర్ధారించింది. ప్రస్తుతం వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
Also Read
- Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
- IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
- Gurnoor Brar: డేల్ స్టెయిన్‌లా టెస్టుల్లో ఆధిపత్యం సాధిస్తా.. టీమిండియా పేసర్ కీలక వ్యాఖ్యలు..!
- Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
అభిమానుల అసంతృప్తి:
ఆకాష్ దీప్ స్థానంలో మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మిగిలిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. అయితే ఈ నిర్ణయంపై కొందరు క్రికెట్ అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణకు బదులుగా సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని చర్చిస్తున్నారు. సిరాజ్‌కు మరోసారి అవకాశం దక్కకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం సబ్‌స్టిట్యూట్‌గా సిరాజ్‌కు అవకాశం ఇవ్వాల్సింది అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని సమర్థించాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేసే అవకాశం వచ్చినప్పుడు, ఇప్పటికే ఆ సిరీస్‌లో ఆడిన ఆటగాడిని తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు. సిరాజ్‌ను తీసుకొస్తే మ్యాచ్‌లో వెంటనే ప్రభావం చూపించడానికి అతడికి తగినంత సమయం లేదా సన్నద్ధత లేకపోవచ్చని అశ్విన్ పేర్కొన్నాడు.
వెంటనే ప్రభావం చూపించడం కష్టమే:
‘కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఉపయోగించుకునే అవకాశం వచ్చినప్పుడు, ఇప్పటికే సిరీస్‌లో ఆడిన ఆటగాడిని ఎంపిక చేయడం ఎప్పుడూ మంచి నిర్ణయం. సిరాజ్‌ను ఈ సమయంలో తుది జట్టులోకి తీసుకుంటే వెంటనే ప్రభావం చూపించడం అతడికి కష్టమవచ్చు’ అని అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మొత్తంగా ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికకు గల కారణంపై నెట్టింట జోరుగా చర్చ కొనసాగుతోంది. ఒకవైపు ఆకాష్ దీప్ సేవలను కోల్పోవడం భారత్‌కు ఎదురుదెబ్బ కాగా.. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ మిగిలిన మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం మూడో రోజు రెండో సెషన్ ఆట ముగిసింది. టీ బ్రేక్ సమయానికి కివీస్ స్కోరు 9 ఓవర్లకు 36/1. క్రీజ్‌లో హెన్రీ నికోల్స్ (12), డేవన్ కాన్వే (15) ఉన్నారు. న్యూజిలాండ్ ఆధిక్యం 146 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 246 పరుగులు చేయగా.. కివీస్ 356 రన్స్ చేసింది.
తాజావార్తలు
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
-
Women’s Reservation Bill 2026: లోక్‌సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!