Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jurala Project: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 29 గేట్లను ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్‌లోకి లక్షా 56 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దిగువకు లక్షా 59 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. జలాశయానికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాలువలకు కూడా ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లోనూ పనులు జోరుగా సాగుతున్నాయి. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల పరిధిలోని మొత్తం 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
మరోవైపు, కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి శ్రీశైలం వైపు వేగంగా దూసుకొస్తోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో ఏకంగా 220 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో కృష్ణా, కోయనా నదులు ప్రళయరూపంలో ప్రవహిస్తున్నాయి. అక్కడ రాధానగరి, వారణా జలాశయాలు ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో, రాబోయే 48 గంటల్లో ఆల్మట్టి డ్యామ్‌కు ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ ప్రవాహం మరింత తీవ్రతరం కానుంది. ప్రస్తుతం కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.20 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. రాబోయే వారం రోజుల పాటు శ్రీశైలానికి భారీ స్థాయిలో వరద కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే ఉధృతి మరొక వారం రోజులు ముమ్మరంగా కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయి, అధికారులు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మను పరుగులు తీయించనున్నారు.
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
తాజావార్తలు
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!