Fauzi: ప్రభాస్‌కు తల్లిగా అలనాటి అందాల తార.. ‘ఫౌజీ’లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 1970ల నాటి యుద్ధ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో జోరుగా చక్కర్లు కొడుతోంది. అలనాటి అందాల తార జయప్రద ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమాలో ఆమె ప్రభాస్ తల్లి పాత్రను పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసుకున్న ఈ సినిమాపై డార్లింగ్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న ‘ఫౌజీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అభిమానులకు మరో సర్ప్రైజ్ కూడా రెడీ అవుతుందని టాక్. ఆగస్టు 14న ఈ చిత్రం నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రతో పాటు సినిమా విజువల్ టోన్, యుద్ధ నేపథ్యాన్ని చూపించే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే జయప్రద పాత్రతో పాటు ఆగస్టు 14 గ్లింప్స్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
- Mega Hero's : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
- David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
- Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!