MG Hector Plus Diesel: ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే
- ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల
- ఎక్స్-షోరూమ్ ధర రూ.20 లక్షలు
- 14-అంగుళాల టచ్‌స్క్రీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Motor India ఫేస్‌లిఫ్టెడ్ Hector Plus డీజిల్ వేరియంట్ ధరను ప్రకటించింది. కొత్త డీజిల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.20 లక్షలుగా ఉంది. 2025 డిసెంబర్లో Hector, Hector Plus ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటికీ, అప్పట్లో పెట్రోల్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. తాజాగా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది.
2.0 లీటర్ డీజిల్ ఇంజిన్
కొత్త MG Hector Plus డీజిల్‌లో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్లో ఉపయోగించిన అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్.. 170hp పవర్, 350Nm టార్క్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వస్తుంది. డీజిల్ వేరియంట్లో ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు. డీజిల్ మోడల్ కోసం MG కొత్తగా Sharp Pro (O) ట్రిమ్‌ను పరిచయం చేసింది. ఇది టాప్-స్పెక్ Savvy Pro ట్రిమ్‌కు దిగువన ఉంటుంది. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్ థీమ్‌ను అందించారు. ఏడు సీట్ల క్యాబిన్లో లెదరెట్ అప్హోల్స్టరీ, డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్లపై ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది.
Also Read
- KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
- TVS Callisto 110: టీవీఎస్ Callisto 110 స్కూటర్ లాంచ్.. 33 లీటర్ల స్టోరేజ్, బ్లూటూత్, నావిగేషన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
- Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
14-అంగుళాల టచ్‌స్క్రీన్
కొత్త Hector Plus డీజిల్‌లో ప్రధాన ఆకర్షణల్లో టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 14-అంగుళాల పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫిజికల్ కంట్రోల్స్‌తో 3-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికులకు మెరుగైన ఆడియో అనుభవం కోసం సబ్‌వూఫర్, యాంప్లిఫయర్తో కూడిన 8-స్పీకర్ Infinity సౌండ్ సిస్టమ్ ను అందించారు. అలాగే రెండో, మూడో వరుస ప్రయాణికుల కోసం ప్రత్యేక AC వెంట్లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది.
భద్రతా ఫీచర్లు
భద్రత విషయంలోనూ Hector Plus డీజిల్‌లో పలు ఫీచర్లు అందించారు. అవి 6 ఎయిర్‌బ్యాగ్స్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా
TPMS, ఆటో-డిమ్మింగ్ IRVM, రియర్ వైపర్, వాషర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బయట డిజైన్, ఫీచర్లు
ఎక్స్టీరియర్లో కూడా Sharp Pro (O) వేరియంట్‌కు ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులో LED హెడ్లైట్లు, LED ఫాగ్ ల్యాంప్స్, LED DRLs, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్లైట్లు లభిస్తాయి. అదనంగా పవర్డ్ ORVMలు, రియర్ విండ్‌షీల్డ్ వాషర్ కూడా అందించారు. గతంలో MG Hector డీజిల్‌ను వివిధ ట్రిమ్‌లు, సీటింగ్ ఆప్షన్లలో అందించింది. అయితే తాజా మోడల్లో డీజిల్ ఇంజిన్‌ను ప్రస్తుతం ఏడు సీట్లతో ఒకే Sharp Pro (O) ట్రిమ్‌లో అందిస్తున్నారు. ఇది డీజిల్ SUV కోరుకునే వినియోగదారులకు ఎంపికలను కొంత పరిమితం చేసినప్పటికీ, ప్రీమియం ఫీచర్లతో కూడిన ఒకే వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఇస్తోంది.
ప్రధాన పోటీదారులు
భారత మార్కెట్లో MG Hector Plus డీజిల్‌కు Hyundai Alcazar, Mahindra XUV 7XO, Tata Safari వంటి SUVలు పోటీగా ఉన్నాయి. వీటిలో కొన్ని మోడళ్లు డీజిల్ ఇంజిన్‌తో పాటు మరిన్ని ట్రిమ్‌లు, ట్రాన్స్మిషన్ ఎంపికలను అందిస్తున్నాయి. అయితే Hector Plus డీజిల్‌లో 170hp పవర్, 350Nm టార్క్‌తో కూడిన 2.0-లీటర్ ఇంజిన్, 14-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు దాని ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: వైద్యం కోసం ఏ పేద కుటుంబమూ అప్పులపాలు కాకూడదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
-
Personal Loan Interest Rates: ఏ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ తక్కువ? ఆ బ్యాంకుల మధ్య పోలిక ఇదే..!
-
OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
-
IPL 2027-KKR: కొత్త కెప్టెన్‌గా విండీస్ స్టార్.. కేకేఆర్‌కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
-
Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!