Fungus in Beer Bottle at Hanamkonda: తాజాగా వైన్ షాప్‌లో బీర్ కొన్న ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. బాటిల్‌లో ఫంగస్‌ను చూసి వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగాడు. పలువురు వినియోగదారులు కూడా అతడికి అండగా నిలబడి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ షాప్ వద్ద ఓ కస్టమర్ కింగ్ ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. తాగుదామని మూత ఓపెన్ చేస్తుండగా.. అతడికి బాటిల్‌లో ఎదో కనిపించింది. క్షుణ్ణంగా పరిశీలించగా బాటిల్‌లో ఫంగస్ కనిపించింది. బాటిల్‌లో ఫంగస్ తెలియాడుతోంది. వెంటనే వైన్స్ షాపు దగ్గరకు వెళ్లి అడగగా.. ఓనర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ కస్టమర్ వైన్స్ షాప్ ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటనతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.
Also Read: Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు.. 24 గంటలు కావస్తున్నా..!
వైన్స్ షాపు ఎదుట ఆందోళనకు దిగిన ఆ వ్యక్తికి అక్కడ ఉన్న కస్టమర్స్ మద్దతుగా నిలిచారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అంటూ వైన్స్ షాపుపై మండిపడ్డారు. ఇష్టానుసారంగా బీర్ తయారీదారులు వ్యవహరించడంతోనే ఇలా జరుగుతోందన్నారు. తమకు న్యాయం చేయాలని అందరూ డిమాండ్ చేశారు. కొందరు అయితే వైన్స్ షాపు, కింగ్ ఫిషర్ కంపెనీపై కేసు వేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది.
బీర్ బాటిల్‌లో ఫంగస్.. వైన్ షాపు ముందు ఆందోళన
హనుమకొండ – బీర్ బాటిల్‌లో ఫంగస్ రావడంతో ఆందోళన చెందిన కస్టమర్
ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యమంటూ వైన్ షాప్ ముందు కస్టమర్ ఆందోళన. pic.twitter.com/GI8TuS9qql
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2024