సీతాఫలాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. పండుగానే కాక, ఐస్ క్రీంలో మరియు నిత్య పదార్ధంలోను వాడుతున్నారు.. అందుకే ఈ మధుర ఫలానికి ఈమధ్యకాలంలో గిరాకి పెరిగి అందనంత ఎత్తులో ఉంటుంది… ఆంధ్రా, తెలంగాణాలో కొన్ని చోట్ల మాత్రమే తోటలు విస్తరించి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగిన అవగాహన లేని కారణంగా సాగును విస్తరింప జేయలేక పోతున్నారు. అన్ని రకాల నేలల్లో పెరిగి వర్షాధారంగా కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.. ఈ పంట రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది..
ఈ తోటలకు వర్షాలు లేకపోయినా సరే పండించవచ్చు. డ్రిప్ ను ఏర్పాటు చేసుకుంటే చాలు. మంచి దిగుబడులను సాధించవచ్చు.. అయితే సీతాఫలం పంట సాగు చేసే రైతులు చాలా తక్కువగా ఉండడంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఈ సీతాఫలంలో రెండు రకాలు ఉన్నాయి.. ఒక రకాన్ని బాలానగర్ మరో రకాన్ని సూపర్ గోల్డ్ అనే పేర్లతో పిలుస్తారు. బాలానగర్ సీతాఫలం చెట్ల ఆకులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ రకం మొక్కలను నాటి రెండు సంవత్సరాల తర్వాత మనకు దిగుబడి వస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో కోతకు వస్తాయి. సూపర్ గోల్డ్ రకానికి చెందిన సీతాఫలం చెట్లను కూడా గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేస్తారు..
అయితే ఈ మొక్కలను మొదట ఆరునెలలు వీటిని నర్సరీ పెంచుతారు.. వీటిని రెగ్యులర్ గా ట్యూనింగ్ చేయాలి. ఎండాకాలంలో ఈ మొక్కల ఆకులు పూర్తిగా రాలిపోతాయి. జూన్ నెలలో తొలకరి చినుకులు కురిసిన తర్వాత మళ్లీ ఆకులు చిగురించి పూతకు రావడం ప్రారంభమవుతుంది.. ఈచెట్లకు కేవలం నాలుగు నెలల పాటు నీళ్లు ఎరువులు అందిస్తే చాలు మంచి దిగుబడిని అందిస్తాయి.. ఇక కాయలు కోత దశకు రాగానే తగు జాగ్రత్తలు తీసుకొని మార్కెట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.. ఈ పంట గురించి మరింత సమాచారం ను తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది…