Cyber Fraud : మారని సైబర్ మోసగాళ్ల తీరు.. టెక్నాలజీని ఇలా ఉపయోగిస్తూ..
- కరెంట్ బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ మోసాలు
- మీ బిల్ పెండింగ్‌లో ఉంది, డబ్బులు చెల్లించాలని మెసేజ్ లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు
- ఈరోజు సాయంత్రం లోగా బిల్లు చెల్లించకపోతే మీ ఇంటికి కరెంటు కట్ చేస్తామంటూ బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది.
సైబర్ నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపుతూ, “మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తాం” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్‌లో కొంత మంది లింక్‌ను జత చేస్తూ, “ఇక్కడ క్లిక్ చేసి తక్షణమే బిల్లు చెల్లించండి” అంటూ చెప్పిన లింక్‌ను క్లిక్ చేయమంటున్నారు.
Also Read
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
పరిమిత సమయం ఇచ్చి బెదిరించడం, ఆందోళన కలిగించడం వంటి మార్గాల్లో బాధితులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. భయంతో ఆ లింక్‌ను క్లిక్ చేస్తే, మోసగాళ్లకు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు వెళ్లిపోతాయి. ఈ విధంగా ఖాతాలో ఉన్న డబ్బులను క్షణాల్లో మాయమరిచేలా చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అవినాష్ గణేష్, రోహిత్ కుమార్ వంటి పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఇంకా ఎంతోమంది ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లింకులు క్లిక్ చేయొద్దు: కరెంట్ బిల్లు చెల్లించాలంటూ వచ్చిన సందేశాల్లోని లింక్‌ను క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్లు చెల్లించాలి.
అధికారిక సమాచారం పొందండి: మీ కరెంట్ బిల్లు స్టేటస్ తెలుసుకోవడానికి ఎప్పుడూ డిస్కమ్ అధికారిక వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించండి.
గూగుల్ సెర్చ్ చేయండి: మీకు సందేహం వస్తే, లింక్‌ను క్లిక్ చేయకుండా, మీ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను గూగుల్‌లో వెతకండి.
అనుమానాస్పద సందేశాలను అంగీకరించొద్దు: మీ ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద మెసేజ్‌లను నమ్మకండి. అటువంటి సందేశాలను తక్షణమే డిలీట్ చేయండి.
పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయండి.
తాజావార్తలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్‌కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!