CUET UG Results 2022: సెప్టెంబర్ 15 నాటికి కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CUET UG Results 2022: అండర్ గ్రాడ్యుయేట్ల కోసం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 15 నాటికి ప్రకటించాలని భావిస్తున్నట్లు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అండర్ గ్రాడ్యుయేట్ల కోసం నిర్వహించిన కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను సెప్టెంబరు 15 నాటికి లేదా వీలైతే, రెండు రోజుల ముందుగానే ప్రకటించాలని భావిస్తున్నారు. పాల్గొనే అన్ని విశ్వవిద్యాలయాలు సీయూఈటీ-యూజీ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించడానికి తమ వెబ్ పోర్టల్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి. ,” అని యూజీసీ ఛైర్మన్ అన్నారు.
“ప్రాథమిక నివేదికల ప్రకారం, ఇంటర్నెట్ వేగం మందగించడం వల్ల, సెంటర్ రాధా గోవింద్ విశ్వవిద్యాలయం, రామ్‌ఘర్, జార్ఖండ్‌లో పరీక్ష నిర్వహించబడలేదు. వివరణాత్మక నివేదిక కోసం వేచి ఉంది. 103 మంది అభ్యర్థులకు పరీక్ష త్వరలో నిర్వహించబడుతుంది,” అని ఆయన చెప్పారు.కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్జ్యూయేషన్ కోర్సుల ప్రవేశాల కోసం సీయూఈటీ యూజీని నిర్వహిస్తున్నారు. సీయూఈటీ అంటే.. కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్.
Also Read
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
Dudhsagar Falls: వావ్.. గోవాలోనే మరో టూరిస్ట్ స్పాట్ ..! అక్కడకు ట్రైన్
దేశంలో సీయూఈటీ యూజీ జరగడం ఇదే తొలిసారి. జులై 14 నుంచి ఆగస్టు 30 వరకు.. దేశంలోని 510కిపైగా నగరాల్లో సీయూఈటీ యూజీ పరీక్ష జరిగింది. 12వ తరగతి మార్కుల కన్నా.. ఈ సీయూఈటీ యూజీ ఫలితాల్లో వచ్చే స్కోరు ఆధారంగానే వర్సిటీలు అడ్మిషన్లు తీసుకోవాలని యూజీసీ ఈ ఏడాది మార్చ్‌లో ప్రకటించింది. అయితే.. మినిమం స్కోరు ఎంత ఉండాలి? అన్న విషయాన్ని వర్సిటీలకు వదిలేసింది. 2022-23 విద్యాసంవత్సరం కోసం సీయూఈటీ యూజీ ఫస్ట్ అడిషన్లో 44 కేంద్ర వర్సిటీలు, 12 రాష్ట్ర వర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలు పాల్గొన్నాయి.
ఈ సీయూఈటీ యూజీ పరీక్ష కోసం 18లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇప్పుడు సీయూఈటీ యూజీ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సీయూఈటీ యూజీ ఫలితాలు ఈ నెల 9లోపే వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు.
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!