గోవా పేరు వినగానే మనందరికీ బీచ్, రిసార్టులు గుర్తొస్తాయి.
కానీ, వాటికి ఏ మాత్రం తగ్గని థ్రిల్ కలిగించే మరో టూరిస్ట్ స్పాట్ ఉందక్కడ. అదే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్.
పేరుకు తగ్గట్టుగానే ఎత్తయిన పచ్చటి చెట్లతో నిండిన కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతం.
నీటి జల్లులు పొంగిపొర్లుతున్నాయేమో అనే అనుభూతి కలుగుతుంది.
దాదాపు వెయ్యి అడుగుల ఎత్తునుంచి జాలువారే ఆ జలపాతం చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు.
ఇదంతా ఒకెత్తయితే..
ఆ జలపాతానికి అతి దగ్గరగా..
కొండల మధ్యలో నుంచి ట్రైన్
ట్రైన్లో వెళ్లే సమయంలో జలపాతపు నీళ్లు తుంపర్లుగా వచ్చి ప్రయాణికులపై పడుతుంటే..
ఒళ్లు ట్రైన్లోనే తడిసి ముద్దయి పులకరించిపోతుంది.
జలపాతాన్ని ఆస్వాదించేందుకు ట్రైన్ కాసేపు ఆపేస్తారట.
సెల్ఫీలంటే ఇష్టం లేని వారి సెల్ఫోన్లు కూడా సెల్ఫీలు తీసేస్తాయి మరి.