ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. హోంగ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించాలని సీఎస్కే భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా.. మరో విజయంపై కన్నేసింది.
చెన్నై ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), మహీష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రహమన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్ పాండే.
కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రఘువంశీ, ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.