ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. హోంగ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించాలని సీఎస్కే భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా.. మరో విజయంపై కన్నేసింది.