ముస్లింలు, హిందువుల మధ్య మత కల్లోలలు సృష్టించందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ విమోచనానికి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు సీతారాం ఏచూరి. జనగామ జిల్లాలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్బంగా రైల్వే స్టేషన్ నుండి ప్రెస్టన్ మైదానంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు.. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ విమోచనం తర్వాత కమ్యూనిస్టుల రాజ్యం ఎక్కడ వస్తుందో అని భూస్వాములు బయపడ్డారని, విమోచనం జరిగినప్పుడు ఆర్.ఎస్.ఎస్ నాయకులు అందరూ జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని, ఎన్నికల్లో ఎవరు గెలిచిన సీబీఐ, ఈడి లను పెట్టి బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తోందని, దానికి నిదర్శనం గోవా, మహారాష్ట్రలనేనని, బీజేపీ దేశ వ్యాప్తంగా దిగజరిపోతుండడంతో మత ఘర్షణలు జరిపి ఒక మతం ఓట్లు దండుకోవలని చూస్తున్నారని అన్నారు.