CPI Ramakrishna: పాక్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారు.. మావోయిస్టులు భారత పౌరులే అయినా చర్చలు చేయరా?
- నంబాల మృతదేహంను అప్పగించకపోవడంపై నిరసన
- నిరసనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- మావోయిష్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా?
- కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారని, మావోయిస్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతదేహంను కుటుంబ సబ్యులకు అప్పగించకపోవడంపై ప్రజా సంఘాల ఐక్యవేదిక నిరసన తెలిపింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా సీపీఎం, పౌర హక్కుల సంఘం, ప్రజాసంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ… ‘మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తెలుగు వారి మృతదేహాలు ఇప్పించాలని నిన్న లేఖ రాసాము. మృతదేహాలు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలి. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా.. కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించింది. ఇది నక్సలైట్లకు, కమ్యూనిస్టులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారు. మావోయిష్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా?’ అని ప్రశ్నించారు.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Also Read: TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతదేహానికి ఛత్తీస్‌గఢ్ పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు. శవాన్ని అప్పగించాలని నంబాల బంధువులు కోరినా.. పోలీసులు ససేమిరా అన్నారు. దాంతో నంబాల బంధువులు నిరాశతో ఇంటికి పయనం అయ్యారు. మృతదేహాన్ని అప్పగించలని వేడుకున్నా ఫలితం లేకపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీయన్నపేటలో విషాదచయలు అలుముకున్నాయి. చేసేసి లేక నంబాల కేశవరావు చిత్రపటానికి కుటుంబసభ్యులు నివాళి అర్పించారు.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!