Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
- బంగాళాఖాతం అల్పపీడనంతో హైదరాబాద్‌లో భారీ వర్షం
- ప్రధాన రహదారులు జలమయం.. గణేష్ మండపాల్లోకి నీరు
- సాయంత్రం వేళ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
- విద్యుత్ తీగలు, పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. గాలివానతో మొదలైన వాన కొద్దిసేపట్లోనే తీవ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు కీలక ప్రాంతాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ మార్పుల వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జలమయమైన ప్రధాన రహదారులు.. గణేష్ మండపాల్లోకి నీరు
వర్ష తీవ్రతకు నగరంలోని ఐటీ కారిడార్ సహా ప్రధాన నివాస, వ్యాపార ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, కూకట్పల్లి, మాదాపూర్, బాలానగర్, మియాపూర్ లలో రహదారులపై నీరు నిలిచిపోయింది. అలాగే నగర తూర్పు భాగాన ఉన్న ఉప్పల్, లక్డీకాపూల్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్.బి.నగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో కూడా కుండపోత వాన కురిసింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ, పలు ప్రాంతాల్లోని వినాయక మండపాల్లోకి వర్షపు నీరు చేరడంతో నిర్వాహకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
స్తంభించిన ట్రాఫిక్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణం దుర్భరంగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా రోడ్లపైకి వచ్చేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్, పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా ప్రమాదాలు జరగకుండా విద్యుత్ తీగలు, పోల్స్ వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బాటసారులు , వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాల సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!