మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారని, మావోయిస్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ మధు, మావోయిస్టు పత్రిక జంగ్ ఎడిటర్ నవీన్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం.…