ప్రధాని మోడీ ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసం చేసి.. రక్తసిక్త హస్తంలో వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేసి.. అది అమలు కాకపోతే ప్రధానికి సిగ్గులేదా? అని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేసి విశాఖ కి మోడీ వస్తున్నారని, రుషికొండ కి ఓ సారి వెళ్లి పరిశీలించండని, కన్నబాబు ఐఏఎస్ చదివాడా..? ఐటీఐ చదవాడా..? అని ఆయన ప్రశ్నించారు. నేను క్యూబాలో ఉంటే ఒకటి రెండు రోజుల్లో రుషికొండ వెళ్ళండి అని నాకు సమాచారం ఇచ్చాడన్నారు. అయితే.. ప్రధాని రాకకు నిరసిస్తూ విశాఖ బంద్ కి పిలుపు ఇచ్చారు నారాయణ. నల్ల జెండాలతో నిరసన తెలుపాలన్నారు. తెలంగాణ విభజన హామీలు అమలు చేయని మోడీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రామగుండం బంద్ కి పిలుపు నిస్తున్నామని, నల్లజెండాల ప్రదర్శన చేస్తామన్నారు. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు..పార్టీలపై ఈడీ దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు మోడీ అని, గవర్నర్ లతో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుందని, గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Kunamneni: ఫోన్ ట్యాప్ జరిగితే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా?
రాష్ట్రపతి..గవర్నర్ వ్యవస్థలతో నష్టమే తప్పా లాభం లేదని, రెండు వ్యవస్థలను రద్దు చేయాలన్నారు. గవర్నర్ వ్యవస్థ బ్రష్టుపట్టిందని, బెంగాల్, తమిళనాడు.. కేరళ లో గవర్నర్ లతో రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతుందని ఆయన ఆరోపించారు. గవర్నర్ రాజకీయ ఉపన్యాసం ఇస్తుందని, లక్ష్మణ రేఖ గవర్నర్ దాటిందని, గవర్నర్ ఆర్‌ఎస్‌ఎస్ రాసిన రాజ్యాంగం చదివిందన్నారు. మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చదివాము. దర్భార్ పెట్టె హక్కు నీకు ఎక్కడిది. నువ్వు బీజేపీ కార్యకర్తవి. తమిళనాడులో బీజేపీ తరపున పోటీ చేసి ఒడిపోయావు. యూనివర్సిటీ బిల్లులు ఆపే హక్కు గవర్నర్ కి ఎవరిచ్చారు. ఇష్టం లేకుంటే వెనక్కి పంపించాలి. మళ్ళీ అదే బిల్లు పంపిస్తే విధిగా అమలు చేయాల్సిందే. కానీ బిల్లులు పెండింగ్ లో పెట్టె హక్కు లేదు. హద్దుల్లో ఉంటే గౌరవం ఉంటుంది. హద్దులు దాటితే గౌరవం ఉండదు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుంది గవర్నర్.’ అంటూ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.